అధికారుల అవినీతికి కారకులు సిఎం, మంత్రులే : సిపిఐ రామకృష్ణ

Dec 25,2023 20:47 #cpi ramakrishna

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: అధికారుల అవినీతికి ముఖ్యమంత్రి, మంత్రులే కారకులని, దీనికి సిఎం, మంత్రులు నైతిక బాధ్యత వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లిక్కర్‌, మైనింగ్‌, ఇసుక అమ్మకాలు ద్వారా వచ్చిన రూ.కోట్ల సొమ్మును తాడేపల్లి ప్యాలెస్‌కు తరలించినట్లు ఒకపక్క ఆరోపణలు గుప్పుమంటుంటే.. మరోపక్క ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల పర్యటనలకయ్యే ఖర్చులను కిందిస్థాయి అధికారులు, సిబ్బంది సమకూర్చాలంటూ ఒత్తిడి పెంచడం అవినీతికి ఆస్కారమివ్వడమే అవుతుందన్నారు. కేవలం మడశిర తహశీల్దారును సస్పెండ్‌ చేయడంతో సమస్య పరిష్కారమైనట్లు కాదన్నారు. మంత్రులు, అధికారులు పర్యటనల సందర్భంగా సభలు, సమావేశాలు భోజన వసతులు ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు.

➡️