మరికొద్ది సేపటిలో సీఎల్పీ సమావేశం

clp meetig in gacchiboli

గచ్చిబౌలి: మరికొద్ది సేపటిలో జరగనున్న సీఎల్పీ సమావేశం నేపథ్యంలో గచ్చిబౌలిలోని హోటల్‌ ఎల్లాకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరారు. సీఎల్పీ సమావేశం కంటే ముందే నేతల సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. డీకే శివకుమార్ తో సహా పలువులు కాంగ్రెస్ నేతలు ఎల్లాకి చేరుకున్నారు. సీఏం ఎంపిక విషయంలో అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేయనుంది. రేవంత్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతోంది. ప్రజాదరణ కలిగిన నాయకుడిగా రేవంత్‌కి గుర్తింపు ఉంది. 88 సభల్లో పాల్గొని కాంగ్రెస్ గెలుపులో రేవంత్ ప్రధాన పాత్ర పోషించారు. వీలైతే నేడు కాంగ్రెస్ సీఏం, డిప్యూటీ సీఏంతో ప్రమాణ స్వీకారం చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. లేదంటే ఈ నెల 6న ప్రమాణ స్వీకారం ఉండనుంది. డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తే గ్రాండ్‌గా ఉంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే గవర్నర్‌ను కాంగ్రెస్ నాయకులు కోరారు.

➡️