పోస్ట్‌ ప్రొడక్షన్స్‌లో ‘సిటడెల్‌’

Mar 19,2024 20:32 #movie, #New Movies Updates, #samantha

వరుణ్‌ ధావన్‌, సమంత జంటగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌’కు రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ పూర్తికావటంతో ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముంబై వేదికగా ప్రైమ్‌ వీడియో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘సిటడెల్‌: హనీ-బన్నీ’ అనే టైటిల్‌ను ఖరారుచేశారు. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. కేకే మేనన్‌, సిమ్రన్‌, సోహమ్‌ మజుందార్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో అదరగొట్టిన సమంత ‘సిటడెల్‌’ కోసం ప్రత్యేకంగా మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకున్నారు. సిటాడెల్‌ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించారు.

➡️