నాలుగేళ్ల కుమారుడిని చంపిన స్టార్టప్‌ సిఈవో

Jan 9,2024 15:12 #Bengaluru, #CEO

పనాజీ : బెంగళూరులోని ఓ స్టార్టప్‌ కంపెనీ సీఈవో తన నాలుగేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసింది. గోవా టూర్‌కి తీసుకెళ్లిన తన కుమారుడిని చంపి.. మృతదేహాన్ని ఓ బ్యాగ్‌లో పెట్టి తీసుకువెళుతున్న సమయంలో ఆమెను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సుచనా సేథ్‌ (39) బెంగళూరులోని మైండ్‌ఫుల్‌ ఏఐ ల్యాబ్‌ కంపెనీ సీఈవోగా పనిచేస్తున్నారు. నార్త్‌ గోవాలోని కాండలిమ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తన కుమారుడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎందుకు ఆమె తన కన్నబిడ్డను చంపుకోవాల్సి వచ్చిందో పూర్తి వివరాలు తెలియవు. కాగా, కాండలిమ్‌లోని బనియన్‌ గ్రాండ్‌ హోటల్‌లోకి సుచనా తన కుమారుడితో కలిసి చెక్‌ ఇన్‌ అయ్యింది. అయితే ఆమె సోమవారం ఒంటరిగా చెక్‌ ఔట్‌ అయ్యింది. ఆమె బెంగళూరుకి ట్యాక్సీ బుక్‌ చేయాలని హోటల్‌ స్టాఫ్‌ని కోరింది. ఆ సమయంలో హోటల్‌ స్టాఫ్‌ ఫ్లయిట్‌లో వెళ్లాలని ఆమెకు సూచించినా.. ట్యాక్సీలోనే వెళ్లేందుకు మొగ్గుచూపింది. అయితే చెక్‌ అవుట్‌ అయినప్పుడు ఆమె తన కుమారుడితో వెళ్లలేదని హోటల్‌ సిబ్బంది గుర్తించారు. ఇక ఆమె రూమ్‌ నుండి వెళ్లిన తర్వాత ఆ రూమ్‌లో రక్తపు మరకలు ఉన్నట్లు హౌజ్‌ కీపింగ్‌ స్టాఫ్‌ గుర్తించారు. వెంటనే హోటల్‌ సిబ్బందికి ఆమెపై అనుమానం వచ్చి గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్యాబ్‌ డ్రైవర్‌కి ఫోన్‌ చేసి సుచనాను తన కుమారుడి గురించి చెప్పమని ఫోన్‌లో అడిగారు. కుమారుడు తన ఫ్రెండ్‌ దగ్గర ఉన్నాడని ఫ్రెండ్‌ అడ్రస్‌ ఇచ్చింది. పోలీసులు అది ఫేక్‌ అడ్రస్‌ అని తెలుసుకున్నారు. ఈసారి పోలీసులు డ్రైవర్‌కి ఫోన్‌ చేసి సుచనాకు అర్థంకాకుండా కొంకణి భాషలో మాట్లాడారు. నేరుగా దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లమని పోలీసులు డ్రైవర్‌కి ఆదేశించారు. దీంతో హిరియూర్‌ తాలూకాలోని ఐమంగళ పోలీస్‌ స్టేషన్‌కు ఆమెను తీసుకుని వెళ్లాడు. అక్కడ చిత్రదుర్గ పోలీసులు సేథ్‌ను అదుపులోకి తీసుకున్నారు.బ్యాగ్‌ తెరచి చూడగా బాబు మృతదేహం కనిపించింది. దీంతో అందరూ షాక్‌ అయ్యారు. తరువాత ఆమెను గోవా పోలీ సులు అరెస్టు చేసి మపుసా కోర్టులో హాజరుపర చగా గోవా పోలీసులు ఆమెకు ఆరు రోజుల పాటు పోలీస్‌ కస్టడీ విధించారు. భర్తతో విడాకు లు కోరిన ఆమె, కోర్టు తీర్పుపై నిరాశతో ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

➡️