Health : వేసవిలో ఉప్పు నీటిని తాగితే ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

Apr 1,2024 12:56 #health

ఇంటర్నెట్‌డెస్క్‌ : వేసవిలో విపరీతమైన ఎండల వల్ల చెమటలు పట్టడం డీహైడ్రేషన్‌కి గురవ్వడం జరుగుతుంటుంది. రోజుకి ఎన్ని నీటిని తాగినా సరే నోరు ఎండిపోతుంది. చల్లని నీరు లేదా, కొబ్బరి నీళ్లు ఇలా రకరకాలుగా పానీయాలు తీసుకున్నా సరే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో నీటిలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదని, ముఖ్యంగా డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

– వేసవిలో విపరీతంగా చెమట పడుతుంది. దీంతో చెమట రూపంలో సోడియం మాత్రమే కాకుండా ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతాము. అందుకే నీటిలో ఉప్పును కలిపి తాగితే తిరిగి శరీరానికి సోడియం అందుతుంది. తద్వారా డీహైడ్రేషన్‌ నుంచి కూడా తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

– ఉప్పు నీటిని అందరూ తీసుకోకూడదు. రక్తపోటు అధికంగా ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఉప్పునీటిని తీసుకోబోయే వైద్యుల్ని సంప్రదించడం మంచిది.

– మూత్రపిండాల పనితీరు సాధారణంగా ఉన్న వ్యక్తులు కూడా ఉప్పునీటిని తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

➡️