పలు చోట్ల మజ్జిగ చలివేంద్రాల ఏర్పాట్లు

Apr 9,2024 23:04

చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న భీమేశ్వరస్వామిఆలయఇఒ తారకేశ్వరరావు

ప్రజాశక్తి-యంత్రాంగం

వేసవిలో పెరిగిన ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాలో పలుచోట్ల మంగళవారం మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటుచేశారు. రామచంద్రపురం ఉగాది పండుగను పురస్కరించుకొని ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం వద్ద భక్తులకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆలయ ఇఒ పి.తారకేశ్వరరావు చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తులు వేసవికాలం కావడంతో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన వివరించారు. అదేవిధంగా ఉగాదిని పురస్కరించుకొని ఆలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటుగా ఉచిత హౌమియో వైద్య శిబిరాన్ని కూడా మంగళవారం ఏర్పాటు చేసి నట్లు ఆయన వివరించారు. ద్రాక్షారామంలో సూర్య చంద్ర ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రం ను పట్టణ ఆటో యూనియన్‌ గౌరవ అధ్యక్షులు మాగాపు అమ్మిరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని ఆటో యూనియన్‌ ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రయాణికులకు దాహర్తి ని తీరుస్తుందని దీనిని ఏర్పాటు చేసిన వారందరికీ అభినందనలు అనంతరం ఉగాది పచ్చడి, మజ్జిగ పంపిణీ చేపట్టారు, కార్యక్రమంలో యూనియన్‌ సభ్యులు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. మండపేట పట్టణానికి చెందిన అమ్మ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ఇమ్మిడిశెట్టి నాగభూషణం ఆధ్వర్యంలో స్థానిక రథంగుడి వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ అధ్యక్షుడు కాళ్లకూరి గొల్లబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా గొల్లబాబు మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నాగభూషణం చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. అమ్మ ఫౌండేషన్‌ చేస్తున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పంపన శ్రీనివాస్‌, టేకిముడి శ్రీనివాస్‌, చెన్నా సుబ్రహ్మణ్యం గుప్తా, మోగంటి కుమార్‌, కురసాల సత్యనారాయణ, ఓడూరి మహేష్‌, నాళం కిట్టు, పసలపూడి ప్రకాష్‌ గుప్తా, కత్తుల హరీష్‌, వానరాశి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

 

➡️