దిష్టిబొమ్మ దహనం విష సంస్కృతికి చిహ్నం..

ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దిష్టి బొమ్మ దహనం విష సంస్కృతి కి చిహ్నమని కడియం టిడిపి నేతలు పేర్కొన్నారు. మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని ఆధ్వర్యంలో స్థానిక దేవిచౌక్ సెంటర్ నందు గోరంట్ల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ దిష్టిబొమ్మ దహనం విష సంస్కృతికి చిహ్నం అని , బీసీ వర్గాల విభజనకు దారి తీసే విధంగా మంత్రి చెల్లబోయిన వేణు చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు మార్గాన్ని సత్యనారాయణ, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పితాని శివరామకృష్ణ, నియోజవర్గ మహిళ అధ్యక్షురాలు ముత్తాబత్తుల విజయ, మండల బీసీ సెల్ అధ్యక్షులు యనమదల రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో చెత్త పనులు చేస్తూ చెత్త మంత్రిగా పేరు తెచ్చుకున్న మంత్రి వేణు పై ఆగ్రహ జ్వాలలు వెళ్ళగక్కారు. విభజించి పాలించు అనే సూత్రాన్ని రూరల్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టాలని చూస్తే ఖబర్దార్ అని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కల్లిబొల్లి మాటలు చెప్పిన ఇక్కడ బీసీలు ఎంత ఏకతాటిపై ఉన్నామని, అందుకు నిదర్శనమే మూడు పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ పీఠాన్ని కైవసం చేసు కుందని మరోసారి ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికు హ్యాట్రిక్ విజయాన్ని అందించేందుకు మేమంతా సంసిద్ధంగా ఉన్నామన్నారు., ఎన్నడూ లేని విధంగా దిష్టిబొమ్మల దహనం మంత్రి తో బాటుగా ఇక్కడకు రావడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అన్నందేవుల చంటి, బోడపాటి గోపి, వాసంశెట్టి నాగబాబు, జల్ది కృపారావు, గుర్రపు సత్యనారాయణ, జోగి చక్రవర్తి, వనుం సూరిబాబు, గుత్తుల కృష్ణ, షేక్ సిద్దయ్య, అనసూరి గోవిందు, గోరు నాగేశ్వరరావు, వరగోగుల వెంకటేశ్వరరావు, దోంతంశెట్టి శ్రీనివాస్, బొరుసు వెంకటేశ్వరరావు, కొత్తపల్లి శ్రీరామ్, మర్రెడ్డి రమేష్, పాతూరి రాజేష్, దంగేటి శ్రావణ్, వాసంశెట్టి బాలాజీ, ఇడుపుగంటి రమేష్, ఉండి సత్తిబాబు, మిద్దె గోపి, కంటిపూడి శ్రీను, గుబ్బల రాఘవేంద్రరావు, కనికెళ్ల బుల్లియ్య, మందపల్లి రత్నరాజు, బళ్లాడి జాన్, పల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

➡️