విద్యుత్ షాకుతో గేదె మృతి

Dec 1,2023 13:27 #Prakasam District
buffalo died by current shock

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం

ప్రజాశక్తి-వెలిగండ్ల : మండలంలోని గన్నవరం గ్రామంలో విద్యుత్ షాక్ తో గేదె మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం గన్నవరం గ్రామంలో నడి ఊరిలో ట్రాన్స్ఫర్ మ్ క్రింద ఉండటం, దాని చుట్టూ రక్షణ ఏర్పాటు చేయక పోవడంతో గేదె మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. గతంలో కూడా ఇదే ప్రదేశంలో గేదె మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలిపారు.

➡️