కోవిడ్‌ను ఎదుర్కోవడంలో వైఫల్యానికి బోరిస్‌ జాన్సన్‌ క్షమాపణలు

Dec 8,2023 10:35 #Boris Johnson

 

లండన్‌: కోవిడ్‌ సంక్షోభాన్ని పరిష్క రించడంలో తమ ప్రభుత్వం విఫలమైందని బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అంగీకరించారు. పార్లమెంటు నియమించిన విచారణ కమిటీ ముందు ఆయన సాక్ష్యం చెబుతూ అంటువ్యాధి వల్ల కలిగే నొప్పి, నష్టం , బాధలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. వైరస్‌పై సరైన అవగాహన లేకుండా హడావుడిగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కోవిడ్‌ కారణంగా దేశంలో 2,30,000 మంది మరణించారని బారిస్టర్‌ హ్యూగో కీత్‌ బోరిస్‌కు గుర్తు చేశారు. ‘చనిపోయినవారు మీ క్షమాపణ వినలేరు’ అని పోస్టర్‌ పట్టుకుని నిరసన తెలిపారు. కోవిడ్‌ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న రిషి సునాక్‌ కూడా విచారణ కమిటీ ముందుకు హాజరు కావాల్సి ఉంటుంది.

➡️