పుస్తకాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి

tdp protest against arrest

మంత్రి అంబటి రాంబాబుశ్రీ సత్తెనపల్లిలో ప్రజాశక్తి బుకహేౌస్‌ ప్రారంభోత్సవం

ప్రజాశక్తి-సత్తెనపల్లి (పల్నాడు జిల్లా) : సమాజాన్ని ప్రభావితం చేయగలిగే శక్తిగల పుస్తకాలు ప్రజాశక్తి బుకహేౌస్‌లో దొరుకుతాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని విలేకరుల కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాశక్తి బుకహేౌస్‌ను మంత్రి ఆదివారం ప్రారంభించారు. బుకహేౌస్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన బుక్‌స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పుస్తకాల అవసరం సమాజానికి చాలా ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ న్యాయవాది పిన్నమనేని పాములయ్య మాట్లాడుతూ సాహిత్యం అనేక దశలను దాటుకుంటూ నేటి స్థితికి చేరుకుందని, మూఢనమ్మకాలపై ఎక్కు పెట్టాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. ఇందుకు సాధనాలైన పుస్తకాలు ప్రజాశక్తి బుకహేౌస్‌లో దొరుకుతాయని తెలిపారు. సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య మాట్లాడుతూ.. మతతత్వానికి, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో ప్రజల సాధానంగా ప్రజాశక్తి పనిచేస్తోందని తెలిపారు. అటు పత్రిక రంగంలోనూ.. ఇటు సాహిత్య రంగంలోనూ ప్రజాశక్తి కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రజాశక్తి సాహితీ సంస్థ చైర్మన్‌ వి.కృష్ణయ్య మాట్లాడుతూ పుస్తకాల్లో అమూల్యమైన సమాచారం ఉంటుందని, పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. ప్రజాశక్తి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వై.అచ్యుతరావు మాట్లాడుతూ.. అభ్యుదయ పుస్తకం మంచి మిత్రుడని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, దేశం ఎలా ముందుకు వెళుతున్నది అనేది పుస్తకాల ద్వారానే తెలుస్తుందన్నారు. అనంతరం ప్రజాశక్తి జనరల్‌ మేనేజర్‌ జి.శివరామకృష్ణయ్య, సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌, పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ పొట్టి సూర్యప్రకాష్‌రావు మాట్లాడారు. తొలుత ‘రాష్ట్ర ప్రాజెక్టులు-నీటి వనరులు’ పుస్తకాన్ని మంత్రి రాంబాబుకు వి.కృష్ణయ్య బహూకరించారు. మున్సిపల్‌ చైర్మన్‌ చలంచర్ల లక్ష్మి తులసి సాంబశివరావు, కౌన్సిలర్‌ అచ్యుత శివప్రసాద్‌, ప్రజాశక్తి బుకహేౌస్‌ విజయవాడ మేనేజర్‌ బి.శ్రీనివాస్‌, ప్రజాశక్తి సిబ్బంది, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️