ఐక్యతతో ప్రజా వ్యతిరేక పాలనకు అడ్డుకట్ట

Nov 19,2023 22:41 #CITU, #Konaseema

 

ప్రజాశక్తి-అమలాపురం : ఐక్యతతో ప్రజా వ్యతిరేక పాలనకు అడ్డుకట్ట వేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షక సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్‌ 27, 28 తేదీల్లో విజయవాడ మహా ధర్నా జయప్రదం చేయాలని అమలాపురం యుటిఎఫ్‌ హోం వద్ద సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వరంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి దుర్గాప్రసాద్‌ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హొకేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతులు, కార్మికులు సామాన్య ప్రజలకు కష్ట నష్టాలను కలిగించుతూ పాలన సాగుస్తున్నారన్నారు. దీని అడ్డుకట్ట వేయడం కోసం ప్రజలందరూ కూడా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించటానికి రైతులు ఆత్మహత్యలు నివారించడానికి వ్యవసాయ గిట్టుబాటు రైతు తన కుటుంబంతో ఆత్మగౌరవంతో మనగలడానికి పంటకు సమగ్ర పంట ఉత్పత్తి వ్యాయామానికి 50 శాతం అదనంగా కలిగి చట్టబద్ధ కనీసం నిర్ణయించవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఎలక్ట్రిసిటీ బిల్‌ పాస్‌ కానప్పటికీ అడ్మినిస్ట్రేటివ్‌ ఉత్తరల ద్వారా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో 71 లక్షల మీటర్లను బిగించేసింది.2025-26 నాటికి మొత్తం 25 కోట్ల మీటర్లు బిగించడానికి లక్ష్యం సిద్ధం చేసిందన్నారు. హొబిజెపి పాలిత రాష్ట్ర ల్లో సహా అనేక రాష్ట్రాల్లో ఈ మీటర్లు బిగింపు వ్యతిరేకిస్తూ ఉండగా మోడీ మెప్పు హొకొరకు ఆంధ్రప్రదేశ్లో జగన్‌ ప్రభుత్వం ఈ సంవత్సరమే10 లక్షలు వ్యవసాయ పంపు చెట్లకు హొప్రభుత్వ కార్యాలయంలో స్మార్ట్‌ మీటర్లు బిగింప చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులు ఉండగా సుమారు 7 లక్షల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇవ్వబడ్డాయని గుర్తింపు కార్డు లేక కొన్ని పథకాలు కౌలు రైతులు కోల్పోతున్నారని అన్నారు. పలు దశాబ్దాలుగా సంఘటిత పోరాటాలు పర్యావసరంగా కార్మికలోకం సాధించుకున్న హక్కులను భంగం కలిగిస్తూ 44 కార్మికు చట్టాలను రద్దుచేసి పారిశ్రామికవేత్తలకు అధిక లాభాలను చేకూర్చేలా మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చిందన్నారు. కార్మిక సంఘాలతో చర్చించకుండానే లేబర్‌ కోర్టులను పార్లమెంట్లో పాస్‌ చేసిందన్నారు. రోజు పనిగంటలో 8 గంటల పనితో పరిమితం చేయవలసి ఉండగా ఇప్పుడు 12 గంటల వరకు పనిగంటలు పరిమితులు పెంచింది.కనీస వేతనం అమలు కావడం లేదన్నారు. అసంఘటిత రంగం కార్మికుల రిజిస్ట్రేషన్‌ చేసి వారికి పెన్షన్‌ సామాజిక బాధ్యత కల్పించాలన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులకు ఇస్‌ఐను వర్తింపచేయాలన్నారు. సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఈ శ్రమ పోర్టల్‌ నమోదుచేసుకున్న హమాలీ, కొబ్బరి ఒలుపు దింపు ప్రమాదరంగం కార్మికులందరికీ ఆరోగ్య పథకాలు, జీవిత వైకల్య బీమా అమలు చేయాలన్నారు. అంగన్‌వాడీ ఆశ, మధ్యాహ్న, భోజనం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి డిమాండ్‌ చేశారు. హొహొ హొఈకార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.బలరాం, అంగన్‌వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కృష్ణవేణి, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు, కార్యదర్శి పీతల రామచంద్రరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సికిలే సూర్యనారాయణ, ఆశ వర్కర్‌ యూనియన్‌ నాయకులు ఎస్తేరు వివిధ ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కేంద్రం కర్షక -కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వేసిన బుక్లెట్‌ను ఆవిష్కరించారు.

➡️