‘పక్షులు మానవ మనుగడకు అవసరం

'పక్షులు మానవ మనుగడకు అవసరం

‘పక్షులు మానవ మనుగడకు అవసరం’ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:అపోలో యూనివర్శిటీ చిత్తూరులో బర్డ్‌ మాన్‌ కార్తీక్‌, ప్రముఖ అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్‌, వైడ్‌లైప్‌ పరిశోధకులుచే ప్రత్యేక తరగతులను నిర్వహించారు. కార్తీక్‌ మాట్లాడుతూ శేషాచలం అడవులు చాలా అరుదైనటువంటి వన్యప్రాణులకు నివాసమని, అందులో 215 వివిధ రకాల పక్షులు ఉన్నాయని అందులో ఇప్పటివరకు 190 పక్షులను గుర్తించి వాటి ఫోటోలు సేకరించాలని పేర్కొన్నారు. పక్షుల ద్వారా మానవ మనుగడకు కాలుష్య నివారణకు అరుదైన మొక్కలకు సహకరిస్తుందని వారి ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. పక్షులను ఎలా కాపాడుకోవాలి అలాగే వాటి సంరక్షణ గురించి విద్యార్థులకు కార్తీక్‌ వివరించారు. ఈకార్యక్రమంలో 200కుపైన విద్యార్థులు పాల్గొన్నారు. నరేష్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ సేతు, డాక్టర్‌ కైలాష్‌ నాథ్‌రెడ్డి, డాక్టర్‌ మహేంద్ర నాథ్‌, డాక్టర్‌ షానీ, డాక్టర్‌ నవీన్‌, డాక్టర్‌ పురుషోత్తం, డాక్టర్‌ ఫిరోజ్‌ బేగం పాల్గొన్నారు.

➡️