ఉదయనిధి స్టాలిన్‌కు బీహార్‌ కోర్టు సమన్లు

Mar 13,2024 09:34 #Bihar, #Udayanidhi Stalin

పాట్నా : తమిళనాడు క్రీడా మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌కు బీహార్‌లోని ఒక కోర్టు సమన్లు జారీ చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉదయనిధి వ్యాఖ్యలు ఉన్నాయని న్యాయవాది ధర్నింధర్‌ పాండే వేసిన పిటీషన్‌ను విచారణను స్వీకరించిన బీహార్‌లోని ఆరా కోర్టు మంగళవారం విచారణను ప్రారంభించింది. చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ మనోరంజన్‌ కుమార్‌ ఝా సమన్లు జారీ చేశారు. తదుపరి విచారణను ఏప్రిల్‌ 1కు వాయిదా వేశారు. గత ఏడాది సెప్టెంబర్‌ 2న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.

➡️