Bhima Koregaon case : మానవహక్కుల కార్యకర్త సోమాసేన్‌కు బెయిల్‌

న్యూఢిల్లీ :    మానవహక్కుల కార్యకర్త సోమా సేన్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది.  బీమా కొరెగావ్‌ కేసులో  2018 జూన్ 6న  అక్రమంగా అరెస్టు చేసిన ఎన్‌ఐఎ..  ఆమెపై వివాదాస్పద ఉపా (యుఎపిఎ) చట్టాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే.

సోమాసేన్‌ ప్రాథమికంగా నేరానికి పాల్పడలేదని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  ఎన్‌ఐఎ బెయిల్‌ అభ్యర్థనను వ్యతిరేకించనందున వివాదాస్పద యుఎపిఎ చట్టంలోని సెక్షన్ 43(డి)(5)   వర్తించదని తెలిపింది.  తనకు వయసు పెరిగిందని, వైద్య సాయం అవసరమని ఆమె చేసిన విజ్ఞప్తిని కోరు పరగిణనలోకి తీసుకుంటూ .. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.   మహారాష్ట్రను దాటి వెళ్లకూడదని, పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని ఆదేశించింది.

➡️