40 ఏళ్లుగా ప్రజలతో ఉన్నా..!

Apr 22,2024 02:47 #2024 election, #cpm
  • నెల్లూరు సిటీ సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ప్రజలతో 40ఏళ్లుగా కలిసి ఉన్నా… విద్యార్థి దశ నుంచే వామపక్షాల పట్ల ఆకర్షితుడయ్యా.. విద్యార్థి, యువజన, కార్మిక సంఘాల్లో పనిచేశా..ఇప్పటికీ ప్రజలతోనే నడుస్తున్నా పార్టీ పోటీచేయాలని ఆదేశాలిచ్చింది. గతంలో కార్పొరేటర్‌గా పనిచేశాను.. అతి సాధారణ కుటుంబంలో పుట్టాను. 1983లో ఎస్‌ఎఫ్‌ఐలో చేరారు. అప్పటి నుంచి విద్యార్థి సమస్యలపై పోరాటం చేశాను. అప్పటి నుంచి పార్టీ, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నా..జక్కా వెంకయ్య పార్టీ పెద్దల స్ఫూర్తితో నేటికి నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగుతున్నా, జిల్లాలో జరిగిన అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొన్నా. సారా వ్యతిరేక ఉద్యమంలో నడిచా. పాదయాత్ర చేశాను, నలబై సంవత్సరాల్లో జరిగిన ప్రజా పోరాటాల్లో ఉన్నాను. జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్నా పార్టీ ఇక్కడ నుంచి పోటీయాలని నిర్ణయించింది. నెల్లూరు నగర ప్రజలు చాలా తెలివైనవారు. జిల్లాలోనూ, నెల్లూరు నగరంలో జరిగే అనేక ప్రజాఉద్యమాల కారణంగానే హక్కులు సాధించుకున్నారు. నెల్లూరు నగరంలో ప్రభుత్వం పది వేల ఇళ్ల స్థలాలు పంపిణీ చేసుంటుంది. సిపిఎం నిర్వహించిన పోరాట ఫలితంగా సుమారు 20 వేల మందికి ఇంటి స్థలాలు ఇచ్చాం. రేషన్‌కార్డులు, ఇంటి పన్నులు, విద్యుత్‌ పోరాటం, రోడ్లు, డ్రెయినేజీ, మంచినీటి సదుపాయాలు ఇవన్నీ సిపిఎం పోరాట ఫలితంగానే అధికార పార్టీలు చేశాేయంటే అతిశయోక్తి కాదు. ఇది నెల్లూరు ప్రజలకు తెలుసు. ఈ విషయాలనే నేను ప్రచారం చేస్తున్నా, ఓ వైపు వేల కోట్లు ఉన్న పి.నారాయణ టిడిపి నుంచి పోటీ చేస్తున్నారు. అధికార వైసిపి అండతో ఖలీల్‌ కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. మా పార్టీ , ప్రజల ఇస్తున్న ధైర్యంతో వాళ్ల ముందుకు వెళుతున్నా ప్రజా తీర్పు ఎలా ఉన్నా మేం ఏం చేశామో అదె చెబుతున్నాం

➡️