బెంగళూరు సౌత్‌ బిజెపికి సవాల్‌..

Apr 21,2024 03:52

బెంగళూరు సౌత్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బిజెపిల మధ్య పోటీనెలకొంది. ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగునున్న ఈ సీటుకు కాంగ్రెస్‌ నుంచి సౌమ్యరెడ్డి, బిజెపి నుంచి తెజస్వీ సూర్య తలపడుతున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన తెజస్వీ సూర్యకు ఈసారి గెలుపు నల్లేరు మీద నడకలా మారనుంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సొంతగడ్డ కావడంతో వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుపొందెందుకు ఆపార్టీ అన్ని విధాలా ఉపక్రమిస్తోంది. ఓబిసి సామాజిక వర్గానికి చెందిన సౌమ్యకు సీటును కేటాయించింది. సౌమ్య అటు కాంగ్రెస్‌ నాయకులతోపాటు నియోజకవర్గ ప్రజలను సైతం ఆకట్టుకుంటోందని అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే మాజీ బిబిఎంపి (బృహత్‌ బెంగళూరు మహానగర పలికే) కార్పొరేటర్లను తనవైపు తిప్పుకుంది. హిందు, ఈబిసి, దళిత ఓటర్లను ఏకీకృతం చేసేందుకు సిఎం సిద్ధారామయ్య ఇప్పటికే ఈ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేశారు. డిప్యూటీ సిఎం డికె.శివకుమారు కూడా సౌమ్య తన కూతురిగా భావించి ఆశీర్వదించాలని వొక్కలిగాలను కోరారు.
రెడ్డి, నాయుడు సామాజికవర్గాలకు చెందిన తెలుగు మాట్లాడే ప్రజలు సౌమ్యకు మొగ్గు చూపుతున్నారు. మండ్య జిల్లా నుంచి బెంగళూరు దక్షిణ ప్రాంతానికి వచ్చిన వొక్కలిగాలు జెడిఎస్‌కు మొగ్గు చూపుతున్నారు. బిజెపి-జెడిఎస్‌తో పొత్తు వల్ల వొక్కలిగాలు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సూర్యకు మద్దతు ఇచ్చే అవకాశముంది. అయితే చాలావరకు సూర్యకు వ్యతిరేకత ఎదురౌతోంది.
ఇటీవల శ్రీగురు రాఘవేంద్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌ కుంభకోణంపై డిపాజిర్ల మీటింగ్‌లో సూర్య, ఆయన మామయ్య బసవనగుడి ఎమ్మెల్యే రవిసుబ్రమణ్య పాలొన్నా వారంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు.
బెంగళూరు సౌత్‌ పరిదిలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు బిజెపికి, మూడు కాంగ్రెస్‌ గెలుచుకున్నాయి. సౌమ్య 2018లో జయనగర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023లో ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంపై మూడు దశాబ్దాలుగా బిజెపికి పట్టుంది. 2018లో అకాల మరణం చెందిన మాజీ ఎంపి అనంతకుమార్‌ ఐదుసార్లు గెలిచారు. అనంతకుమార్‌ ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు నందన్‌ నిలెకనిపై గెలిచారు. సౌమ్య 2018లో జయనగర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023లో ఓటమి పాలయ్యారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందెందుకు కృషిచేస్తున్నారు. 2019లో కాంగ్రెస్‌ అభ్యర్థి బికె.హరిప్రసాద్‌పై సూర్య గెలిచారు. ఈ సారి అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. సూర్య ప్రధానంగా మోడీ చరిష్మాపై దృష్టి సారించారు. ఇటీవల ఓ హిందు దుకాణదారుడుపై గూండాలు దాడి చేశారు. ఈ సంఘటన నుంచి సూర్య రాజకీయ లబ్ధి చెందాలని చూసిన వీలుపడలేదు. మరోవైపు సౌమ్య కాంగ్రెస్‌ ఐదు హామీలను జోడిస్తూ తన తండ్రి రవాణాశాఖ మంత్రి రామలింగా రెడ్డి బాటలో నడుస్తున్నారు. బెంగళూరు శ్రామిక వర్గం ప్రత్యేకించి మహిళలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. అత్యధికులు దాదాపు 60 మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలు ఉన్నారు. ఇటీవల అధికారుల సోదాల్లో ఒక కారులో రూ1.4కోట్ల నగదు పట్టుబడటంతో ఈ నియెజకవర్గంలో నగదు నీరులా ప్రవహిస్తుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నగదుపై ఇరుపార్టీల వారు మాటల తూటాలు పేల్చారు.

➡️