కొత్తగూడెంలో సిపిఐకి మద్దతు : బివి రాఘవులు

bv-raghavulu-on-cpi-candidates

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా పోరాడే వారితో కలిసి పనిచేయడానికి ఎటు వంటి అభ్యంతరమూ లేదని, అదే సమయంలో ఎటువంటి రాజకీయ కూటములూ ఉండబోవని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ప్రజారక్షణ భేరిలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన బుధవారం విజయవాడలో తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో రాజకీయ కూటమి ఉంటుందా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ప్రస్తుతం కేంద్రంలో బిజెపిని ఓడించడం తమ ప్రధాన కర్తవ్యమని, దానికి అనుగుణంగా పనిచేస్తామని తెలి పారు. అయితే ఇప్పటి వరకూ రాజకీయ కూటములు ఏమీ లేవని, పరస్పర అవగా హన కోసం వేదిక ఉందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం సిపిఎం ప్రత్యా మ్నాయ రాజకీయంతో ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో సిపిఐ, సిపిఎం వేర్వేరుగా పోటీచేస్తున్నాయి కదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ తెలంగాణలో సిపిఐ పోటీ చేస్తున్న స్థానంలో తాము వారికి మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎపిలో తెలుగుదేశం పార్టీపై సిపిఐ కొంత ఆశతో ఉందని తెలిపారు. ఒకవైపు బిజెపితో పొత్తుపెట్టుకున్న జనసేనతో ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తున్న టిడిపిపై సిపిఐ వైఖరి ఎలా ఉంటుందో చూడాలని అన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ సంఘటన ఏర్పాటు చేసే ఆలోచన తమకు లేదని తెలిపారు.

➡️