నెట్‌వర్క్‌ ఆధునీకరణపై బిఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి

Jan 1,2024 21:02 #Business
  • హెచ్‌ఎఫ్‌సిఎల్‌తో రూ.1,127 కోట్ల డీల్‌

న్యూఢిల్లీ : ప్రభుత్వ టెలికం కంపెనీ బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ ఆధునీకరణపై మరింత దృష్టి సారించింది. సంస్థ ఆప్టికల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ నెట్‌వర్క్‌ (ఒటిఎన్‌) ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ను పూర్తిగా మార్చనుంది. ఇందుకోసం హెచ్‌ఎఫ్‌సిఎల్‌ లిమిటెడ్‌కు రూ.1,127 కోట్ల విలువ చేసే భారీ ఆర్డర్‌ను ఇచ్చింది. బిఎస్‌ఎన్‌ఎల్‌ చేపట్టే సమగ్ర నెట్‌వర్క్‌ అప్‌గ్రేడ్‌ కేవలం కంపెనీ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల అవసరాలను తీర్చడమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో మెరుగైన 4జి సేవలను అందించడంతోపాటు 5జి సర్వీస్‌పైనా దృష్టి పెడుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అత్యాధునిక ఆప్టికల్‌ టెక్నాలజీని అమలు చేయడానికి నోకియా నెట్‌వర్క్‌తో వ్యూహాత్మకంగా భాగస్వామ్యం కుదుర్చుకున్నామని హెచ్‌ఎఫ్‌సిఎల్‌ వెల్లడించింది.

➡️