బాలికపై బిజెపి నేత లైంగిక దాడి

Dec 31,2023 09:15 #BJP leader, #girl, #sexually assaults

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని చంపావత్‌ జిల్లాలో ఓ మైనర్‌ బాలికపై బిజెపి నేత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లైంగిక దాడికి పాల్పడిన కమల్‌ రావత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికపై రావత్‌ పలు సందర్భాలలో లైంగిక దాడి చేశాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఐపిసిలోని 376, 504, 506 సెక్షన్లతో పాటు లైంగిక వేధింపుల నుంచి బాలికలను కాపాడేందుకు ఉద్దేశించిన చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. లైంగిక దాడికి గురైన బాలికకు శనివారం వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం ఆమె వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది.

➡️