ఈవీఎంలపై అవగాహన సదస్సు

Jan 23,2024 14:31 #West Godavari District

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి) : యువత ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలని ఏఎంసీ చైర్మన్‌ చిల్లే లావణ్య అన్నారు. స్థానిక మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ సి.హెచ్‌ జయలలిత ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఎలక్ట్రోల్‌ ఓటింగ్‌ యంత్రం (ఈవీఎం)పై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ.ఎం.సి చైర్మన్‌ చిల్లే లావణ్యతో పాటు ఓటర్లు పాల్గొని ఓటింగ్‌ యంత్రాలను (ఈవీఎంలు) పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటు ఎలా వేయాలో అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని లావణ్య పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జి. వి. వి సత్యనారాయణ వైసిపి నాయకులు ఏనుగుపల్లి వర ప్రసాద్‌ ,రాగాన శ్రీను కుసుమే సత్యనారాయణ , కాండ్రేకుల శ్రీను గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

➡️