సివి రామన్‌ టాలెంట్‌ టెస్ట్‌ శ్రీ ప్రకాష్‌ విద్యార్థులకు అవార్డులు

Mar 12,2024 15:45 #Awards, #Kakinada

ప్రజాశక్తి-కోటనందూరు(కాకినాడ) : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు జనవరి 27న రాష్ట్రవ్యాప్తంగా సుచిర్‌ ఇండియా ఫౌండేషన్‌ వారిచే నిర్వహించిన 31వ సివిరామన్‌ ఒలింపియాడ్‌ టాలెంట్‌ టెస్ట్‌లో శ్రీ ప్రకాష్‌ విద్యార్థులు రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించారనివిద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సి.హెచ్‌. విజరు ప్రకాష్‌ తెలిపారు. ఈ పోటీల్లో ఎం. దేదీప్య- 6 వ తరగతి, ఇ. నవీన్‌ హర్ష-5వ తరగతి, రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారని తెలిపారు. వీరితోపాటు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో- టి. గ్రీష్మ శ్రీ-3వ తరగతి, డి. విఖ్యాత్‌-4వ తరగతి, ఎస్‌.కౌషల్‌ కార్తికేయ-6వ తరగతి, జి.లిఖిత్‌-7వ తరగతి, కె.గిరిచరణ్‌-8వ తరగతి, ద్వితీయ స్థానంలో ఎ. సాత్విక- 3వ తరగతి, ఎ.జయంత్‌ – 5వ తరగతి, ఆర్‌. లలిత (10 వ తరగతి) నిలిచారని విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సి.హెచ్‌. విజరు ప్రకాష్‌ తెలిపారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏప్రియల్‌ – 4 న హైదరాబాద్‌ శ్రీ సత్య సాయి నిగమాగమంలో జరిగే కార్యక్రమంలో విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, నగదు బహుమతి అందచేస్తారని అయన తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను విద్యా సంస్థల అధినేత సిహెచ్‌.వి.కె.నరసింహారావు, ఉపాద్యాయులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు తదితరులు అభినందించారు.

➡️