కళాతపస్వి పేరుతో అవార్డు ప్రదానం

Feb 19,2024 17:34 #New Movies Updates

కళాతపస్వి శ్రీ కాశీనాధుని విశ్వనాథ్‌ పేరుతో అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిలిం అండ్‌ మీడియా యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌కు అవార్డు ప్రదానం చేస్తున్నట్లు విశ్వనాథ్‌ కుటుంబం ప్రకటించింది. ప్రభావవంతమైన, అర్థవంతమైన సినిమాని రూపొందించడానికి స్ఫూర్తిని ఇచ్చే లక్ష్యంతో అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియాకు చెందిన ఇద్దరు విద్యార్థులకు ఈ అవార్డును అందిస్తున్నారు. పరిశ్రమ ప్రముఖులచే నిర్దేశించబడిన ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తూ సౌండ్‌ డిజైన్‌, డైరెక్షన్‌ రంగాలలో అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే ఇద్దరు విద్యార్థులను సత్కరిస్తున్నారు. ప్రతి సంవత్సరం, ఈ అవార్డు ద్వారా ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.25,000/- (మొత్తం యాభై వేల రూపాయలు) అందజేస్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం వద్ద అక్కినేని నాగార్జున, అమలతో విశ్వనాథ్‌ కుమారుడు నాగేంద్ర, అతని భార్య లక్ష్మి, కొడుకు ప్రణవ్‌ కలిశారు.

➡️