ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు కిర్గియోస్‌, రడుకాను దూరం..

Dec 8,2023 21:44 #Australia Open, #Tennis
australian open 2024

నాదల్‌, ఒసాకా పునరాగమనం

మెల్‌బోర్న్‌: వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు కిర్గియోస్‌తోపాటు మహిళల సింగిల్స్‌ నుంచి రడుకాను వైదొలిగింది. ఈమేరకు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ నిర్వాహకులు కిర్గియోస్‌తోపాటు యుఎస్‌ ఓపెన్‌ మాజీ ఛాంపియన్‌ రాడుకాను కూడా ఓపెన్‌ ఎంట్రీ జాబితాలనుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. అదే క్రమంలో స్పెయిన్‌ స్టార్‌ ఆటగాడు రఫెల్‌ నాదల్‌తోపాటు జపాన్‌ స్టార్‌ నవోమి ఒసాకా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలో దిగుతున్నట్లు వెల్లడించారు. గతంలో 13వ ర్యాంకర్‌గా ఉన్న కిర్గియోస్‌ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని ఈ ఏడాది జనవరి నుంచి టెన్నిస్‌కు దూరంగా ఉంటున్నాడు. వీరిద్దరికీ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీతో టోర్నమెంట్‌లో ఆడించాలని ఆశించినా ప్రయోజనం లేకపోయిందని నిర్వాహకులు తెలిపారు. 2024 జనవరి 14-28మధ్య ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ జరగనుండగా.. డిఫెండింగ్‌ ఛాంపియన్లుగా అర్యానా సబలెంకా, నొవాక్‌ జకవోవిచ్‌ బరిలోకి దిగనున్నారు.

➡️