టితాస్‌ దెబ్బకు ఆసీస్‌ ఢమాల్‌

Jan 6,2024 09:48 #Sports
  • తొలి టి20లో తొమ్మిది వికెట్ల తేడాతో భారత్‌ గెలుపు

ముంబయి : నవీ ముంబయిలోని డివైపాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన తొలి టి20 భారత మహిళలజట్టు ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 142పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 17.4ఓవర్లలో స్మృతి మంధాన(54)వికెట్‌ కోల్పోయి ఛేదించింది. తొలి వికెట్‌కు స్మృతి మంధాన-షెఫాలీ వర్మ కలిసి 137పరుగులతో విజయతీరాలకు చేర్చారు. మంధాన(54; 52బంతుల్లో 7ఫోర్లు, సిక్సర్‌), షెఫాలీ వర్మ(64నాటౌట్‌; 44బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు) ధాటిగా ఆడారు. వీరిద్దరూ కలిసి 15.2ఓవర్లలోనే 137పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్‌ వారేహామ్‌కు ఒక వికెట్‌ లభించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ టితాస్‌ సద్ధుకు లభించింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను పేసర్‌ టితాస్‌ సద్ధు కట్టడి చేసింది. సద్ధుకి తోడు స్పిన్నర్లు శ్రేయాంక, దీప్తి కూడా రాణించడంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 141పరుగులకు ఆలౌట్‌ చేసింది. భారత బౌలర్లు రాణించడంతో 33పరుగు లకు 4వికెట్లు పడగొట్టి పట్టు బిగించేలా కనిపించి నా.. ఆసీస్‌ యువ బ్యాటర్‌ లిచ్‌ఫీల్డ్‌(49; 32బంతు ల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు), ఎలీసా పెర్రి(37; 30బంతు ల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్‌కు 79పరుగులు జతచేశారు. ఆ దశలో లిచ్‌ఫీల్డ్‌ను అమన్‌జ్యోత్‌ కౌర్‌ ఔట్‌ చేయడం, పెర్రీని దీప్తి ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట ర్స్‌ వెంట వెంటనే ఔటయ్యారు. టితాస్‌ సద్ధుకు నాలుగు, శ్రేయాంక, దీప్తికి రెండేసి, రేణుక సింగ్‌, అమన్‌ జ్యోత్‌ కౌర్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. దీంతో మూడు టి20ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యతలో ఉండగా.. రెండో టి20 ఆదివారం జరగనుంది.

స్కోర్‌బోర్డు..

ఆస్ట్రేలియా మహిళల ఇన్నింగ్స్‌: హీలీ (సి)హర్మన్‌ప్రీత్‌ (బి)రేణుకా సింగ్‌ 8, మూనీ (సి)హర్మన్‌ప్రీత్‌ (బి)టితాస్‌ సద్ధు 17, తహిలా మెక్‌గ్రాత్‌ (సి)పూజ వస్త్రాకర్‌ (బి)టితాస్‌ సద్ధు 0, ఎలీసా ఫెర్రి (సి)అమన్‌జ్యోత్‌ కౌర్‌ (బి)దీప్తి శర్మ 37, గార్డినర్‌ (సి అండ్‌ బి)టితాస్‌ సద్ధు 0, లిచ్‌ఫీల్డ్‌ (సి)హర్మన్‌ప్రీత్‌ (బి)అమన్‌జ్యోత్‌ కౌర్‌ 49, గ్రేస్‌ హర్రిస్‌ (ఎల్‌బి)శ్రేయాంక 1, సథర్లాండ్‌ (సి)హర్మన్‌ప్రీత్‌ (బి)టితాస్‌ సద్ధు 12, వారేహామ్‌ (సి)అమన్‌జ్యోత్‌ (బి)శ్రేయాంక 5, మేగన్‌ స్కట్‌ (ఎల్‌బి)దీప్తి 1, బ్రౌన్‌ (నాటౌట్‌) 0, అదనం 11. (19.2ఓవర్లలో ఆలౌట్‌) 141పరుగులు. వికెట్ల పతనం: 1/28, 2/32, 3/32, 4/33, 5/112, 6/119, 7/135, 8/135, 9/137, 10/141 బౌలింగ్‌: రేణుక సింగ్‌ 4-0-24-1, పూజ వస్త్రాకర్‌ 2-0-28-0, టితాస్‌ సద్ధు 4-0-17-4, శ్రేయాంక 3.2-0-19-2, దీప్తి శర్మ 4-0-24-2, అమన్‌జ్యోత్‌ 2-0-23-1.భారత మహిళల ఇన్నింగ్స్‌: స్మృతి మంధాన (సి)మెక్‌గ్రాత్‌ (బి)వారేహామ్‌ 54, షెఫాలీ వర్మ (నాటౌట్‌) 64, జెమిమా రోడ్రిగ్స్‌ (నాటౌట్‌) 6, అదనం 21. (17.4 వికెట్‌ నష్టానికి) 145పరుగులు. వికెట్ల పతనం: 1/137 బౌలింగ్‌: బ్రౌన్‌ 2-0-10-0, స్కట్‌ 3-0-24-0, సథర్లాండ్స్‌ 2-0-21-0, గార్డినర్‌ 4-0-24-0, మెక్‌గ్రాత్‌ 2-0-31-0, వారేహామ్‌ 3.4-0-20-1.

➡️