కళ్లు ఆర్పితేనే హాజరు : కొత్త యాప్‌ సిద్ధంచేసిన సిఎఫ్‌ఎస్‌ఎస్‌

Mar 10,2024 10:38 #attendance, #blink, #CFSS, #eyes, #new app

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మరో యాప్‌కు తెరతీస్తోరది. గత ఏడాదికిపైగా ముఖచిత్ర ఆధారిత గుర్తిరపుతోనే హాజరు నమోదు చేయాలని నిర్ణయిరచిన ప్రభుత్వం 2022లోనే ఒక యాప్‌ను సిద్ధం చేసిరది. ఇకపై శాఖాధిపతుల కార్యాలయాల్లో, సచివాలయంలో, ఇతర జిల్లా కేంద్రాల్లో కూడా యాప్‌ ద్వారానే హాజరు నమోదుకు ఉత్తర్వులు జారీ చేసిరది. దీనిపై అప్పట్లోనే ఉద్యోగుల నురచి వ్యతిరేకత కూడా వ్యక్తమైరది. ఇప్పుడు ఈ హాజరుపైనే మరో కొత్త యాప్‌కు ఆర్థికశాఖ పరిధిలోని సిఎఫ్‌ఎస్‌ఎస్‌ (సెరటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సిస్టమ్‌) రంగం సిద్ధంచేసిరది. దీనిని మరిరత ఆధునిక పరిజ్ఞానంతో సిద్ధంచేసినట్లు అధికారులు చెబుతున్నారు. విధులకు వచ్చిన వెరటనే హాజరు నమోదుకు (చెక్‌ ఇన్‌), తిరిగి వెళ్లిపోయే సమయంలో (చెక్‌ ఔట్‌)ల నమోదు ఈ యాప్‌ ద్వారానే చేయాలని నిర్ణయిరచిరది. యాప్‌లోకి వెళ్లిన తరువాత ఆన్‌డ్యూటీ బటన్‌ నొక్కితే, విధుల్లో ఉన్నట్లు చూపిస్తురదని, ఆ తరువాత యాప్‌ కెమేరా మురదు ముఖాన్ని ఉరచి కళ్లను ఆర్పితే చెక్‌ఇన్‌ హాజరు రికార్డవుతురదని అధికారులు పేర్కొన్నారు. అనంతరం డ్యూటీలో ఉన్నట్లు రికార్డవుతురదని వివరిరచారు. సాయంత్రం విధుల నురచి వెళ్లిపోయే సమయంలో కూడా చెక్‌ ఔట్‌ బటన్‌ ద్వారా కళ్లు ఆర్పే ప్రక్రియ సాగిరచాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఒక యాప్‌ ద్వారా హాజరు నమోదు సాగిస్తురడగా, మళ్లీ కొత్తగా ఇరకో యాప్‌ అవసరం ఏమొచ్చిరదంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఫోన్‌లలో సిగల్స్‌ సక్రమంగా లేక హాజరుకు ఇబ్బరదులు కలుగుతున్నాయన్న విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు.

➡️