సమ్మె విచ్ఛిన్న ప్రయత్నాలు మానుకోవాలి

Jan 21,2024 00:24

ప్రజాశక్తి – వేటపాలెం
చట్టబద్ధంగా వ్యవహరిస్తున్న అంగన్‌వాడీల సమ్మెను విచ్చిన్నం చేసే కుట్రలను అధికారులు మానుకోవాలని సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు హెచ్చరించారు. శనివారం రాత్రి 7:30 గంటలైనా స్థానిక ప్రాజెక్ట్ ఆఫీసు నందు ఇన్చార్జి పిడి కాజా ఉమా, సూపర్వైజర్లు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంగన్‌వాడీలకు వేరు వేరుగా ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తూ విచ్చనం చేసే ప్రయత్నాలు చేయటం క్షమారహమని అన్నారు. చట్టబద్ధంగా అంగన్‌వాడీలు 40 రోజుల నుండి సమ్మెలో ఉంటే అధికారులకు ఏం పనులు ఉంటాయని నిలదీశారు. అధికారుల నియంతరత్వ ధోరణి విడనాడాలని అన్నారు. ఆఫీసులోకి ఎవరు వెళ్లకుండా గేటు బయట అంగన్‌వాడీ కార్యకర్తలతో ఆయన బయటాయించారు. రాత్రి వేళలో ఆఫీస్ ప్రాంగణంలో నినాదాలతో చుట్టుపక్కల ప్రజలు ఆసక్తిగా సంఘటనా స్థలానికి విచ్చేశారు. కార్యక్రమంలో అంగన్వాడి నాయకురాలు డి బుల్లమ్మాయి, ఎ బ్యుల, కృష్ణవేణి పాల్గొన్నారు.

➡️