అశోక్‌ గల్లా కొత్త సినిమా పోస్టర్‌ విడుదల

Apr 5,2024 15:38 #telugu movies

యువ కథానాయకుడు అశోక్‌ గల్లా మరో కొత్త సినిమాలో నటించబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో సితార పతాకంపై ప్రొడక్షన్‌ నం.27గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అశోక్‌ గల్లా పుట్టినరోజైన శుక్రవారంనాడు కొత్త చిత్రానికి సంబంధించిన విషయాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే టైటిల్‌ను ప్రకటించలేదు. గౌరీప్రియ కథానాయిక. ఉద్భవ్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమ, హాస్యం మేళవింపుతో ఈతరం మెచ్చే అందమైన కథతో ఉంటుందని నిర్మాతలు తెలిపారు. పోస్టర్‌ను బట్టి చూస్తే ఈ చిత్ర కథ అమెరికాలో జరుగుతుందనేది అర్థమవుతుంది. ‘ది స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ’తో కూడిన పోస్టర్‌ డిజైన్‌ ఆకట్టుకుంటోంది. ‘హ్యీపీ బర్త్‌డే అశోక్‌’ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలను చిత్రబృందం తెలియజేసింది.

➡️