సిఐటియు నేతల అరెస్ట్ కు ఖండన

Feb 7,2024 14:46 #Kakinada
asha workers chalo vijayawada

ప్రజాశక్తి – సామర్లకోట : ఆశ వర్కర్స్ విజయవాడ ధర్నా గురువారం నేపద్యంలో బుధవారం తెల్లవారు జామున సామర్లకోట పోలీసులు సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి స్టేషన్ లో సుమారు 6గంటలు ఉంచి, 151 కేసు పెట్టి సంతకాలు తీసుకొని విడిచి పెట్టాడం, వీ కే రాయపురంలో ఆశ వర్కర్స్ అధ్యక్షులు గ్రేస్ ను గృహ నిర్భంధంలో ఉంచి, అక్రమ అరెస్టులను సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎన్. సురేష్, ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, టి నాగమణి, బాలం సత్తిబాబు, కరణం గోవిందరాజు తదితరులు తీవ్రంగా ఖండించారు. విజయవాడలో ధర్నాకు ఇక్కడ అరెస్టులు చేయడం ఎందుకు అని వారు ప్రశ్నించారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారని విమర్శించారు. మహిళల వద్దకు నలుగురు పురుష పోలీసులు వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

➡️