మహీంద్ర బ్లాక్‌ లిస్టులో ఎపి పోలీస్‌

Apr 17,2024 01:12 #mahindra, #police
  •  163 వాహనాలకు లేని చెల్లింపులు : కోర్టుకెక్కిన సంస్థ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : కొన్న వాహనాలకు డబ్బులు చెల్లించని పోలీస్‌శాఖపై ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్ర కోర్టు మెట్లు ఎక్కింది. టెండర్లు ఖరారు చేసేందుకు ఉన్న గవర్నమెంటు ఇ మార్కెట్‌ ప్లేస్‌ పోలీస్‌శాఖను బ్లాక్‌ లిస్టులో పెట్టింది. దీంతో పోలీస్‌శాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. బకాయిలకు 12 శాతం వడ్డీని అదనంగా చెల్లించాల్సి రావడం ఆందోళన కలిగించేదే. అన్ని రంగాల్లో బిల్లులకు మోకాలడ్డుతున్న ఆర్థికశాఖ కీలకమైన పోలీసు రంగంలో కొనుగోళ్లకు అడ్డుపడటం గమనార్హం. వాహనాలు కొనుగోలు చేసిన తరువాత ఇప్పటివరకూ మూడు ఆర్థిక సంవత్సరాలు వచ్చినా నిధులివ్వకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లులను ఏటా వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించడం జరుగుతోందే తప్ప నిధులు విడుదల కావడం లేదని వారంటున్నారు. దిశ పోలీసు స్టేషన్లకు, పోలీసు అధికారుల కోసం 2022 జనవరిలోనే 163 బొలేరో వాహనాలను మహీంద్ర అరడ్‌ మహీంద్ర సంస్థ నుంచి కొనుగోలు చేశారు. రెండు విడతలుగా కొనుగోలు చేసిన ఈ వాహనాలకు రూ.14.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2022 జనవరిలో కొనుగోలు చేసిన ఈ వాహనాలను ముఖ్యమంత్రి అదే ఏడాది మార్చి 23న ప్రారంభించి దిశ పోలీసు స్టేషన్లకు అందించారు. ఈ వాహనాలకు సంబంధించిన వారంటీ కూడా చివరి దశకు వస్తున్నప్పటికీ బిల్లులు ఇప్పటివరకు చెల్లిరచలేదని మహీంద్ర ఆరోపిస్తోంది. ప్రభుత్వ ఇ-మార్కెట్‌ ప్లేస్‌ (జిఇఎం) నిబంధనల మేరకు ఎపి పోలీస్‌శాఖ బ్లాక్‌ లిస్టులోకి చేరుకుంది. దీనివల్ల జిఇఎం ద్వారా కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర పోలీస్‌ శాఖకు అవకాశం లేకుండా పోయింది. వాహనాలకు బిల్లులు రాకపోవడం, జిఇఎం నిబంధనలను ఉల్లంఘించడంతో మహీంద్ర సంస్థ కోర్టును ఆశ్రయించింది. అలాగే కొనుగోళ్లపై ఒప్పందం కుదిరిన నాటి నుంచి 12 శాతం వడ్డీతో తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేసిరది. ఈ నేపథ్యంలోనే మహీరద్ర సంస్థకు చెల్లించాల్సిన నిధులపై తక్షణమే ఆర్థికశాఖ మాట్లాడాలని పోలీస్‌శాఖ నిర్ణయించింది. తద్వారా అదనపు వడ్డీ భారాన్ని తగ్గిరచుకునేందుకు, న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు చూడాలని ప్రయత్నిస్తోంది.

➡️