ఇంటర్నెట్‌డెస్క్ : విరాట్ కోహ్లి, అనుష్కలు 2017 డిసెంబర్ 11వ తేదీన వివాహం చేసుకున్నారు. ఈ జంట తమ ఆరవ వివాహ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. వీరిద్దరూ తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఎంతో సంతోషంగా వారి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. వారి వెడ్డింగ్ యానివర్సరీకి సంబంధించిన ఫొటోలు అనుష్క మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈరోజు (సోమవారం) విరాట్ ప్రేమ, స్నేహితులు, కుటుంబ సభ్యుల కలయికతో సంతోషంగా గడిచిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడానికి ఒకరోజు ఆలస్యమైంది. అనంతమైన ప్రేమకు ఆరేళ్లు నిండాయి. ‘ అని క్యాప్షన్ జోడించారు. ఈ పోస్టుకి విరాట్ కోహ్లి హార్ట్ సింబల్స్‌ని పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.