అంజలి ‘… మళ్లీ వచ్చింది’

Jan 1,2024 19:33 #New Movies Updates

అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్న కొత్త చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. కొత్త ఏడాది 2024 ప్రారంభం సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ మేకర్స్‌ ఈ సినిమా నుంచి స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆమె నటించిన ‘గీతాంజలి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాతో మలయాళ నటుడు రాహుల్‌ మాధవ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. కోన వెంకట్‌ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్నారు. అంజలి నటిస్తోన్న 50వ సినిమా ఇది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

➡️