పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు

Dec 30,2023 14:33 #East Godavari
animal husbandry

ప్రజాశక్తి-చాగల్లు  : చాగల్లు మండలంలోని అన్ని గ్రామాలలో 2-01-2024 నుండి 31-01-2024 వరకు సుమారుగా నెల రోజులపాటు గాలి కుంటు వ్యాధి టీకాలు వేస్తున్నట్లు మండల పశు వైద్యశాఖ అధికారి యు ముకేష్ తెలిపారు. మండల వ్యాప్తంగా సుమారుగా 12 వేల పశువులకు టీకాలు వేయడం జరుగుతుంది.గాలికుంటు వ్యాధి పశువుల్లో వైరస్ ద్వారా వ్యాప్తి చెంది వ్యాధి సోకిన పశువులు బలహీన పడడం, 104-108 డిగ్రీల జ్వరంతో నోరు, నాలుక వద్ద బొబ్బలు ఏర్పడి మేత మేయకపోవడం, చొంగ కార్చడం, గిత్తలు మధ్య పుండ్లు ఏర్పడడం వంటి లక్షణాలు చూపిస్తాయి. పశువుల పాల ఉత్పత్తి తగ్గిపోవడం, కొద్దిపాటి ఎండకు కూడా రొప్పడం,చూడి పశువులు ఈసుకుపోవడం , ఎద్దులలో పని సామర్థ్యం తగ్గడం జరుగుతాయి. 4 నెలల వయస్సు దాటిన ప్రతీ పశువులకు టీకాలు వేయించాలి.కావున ఈ అవకాశాన్ని పాడి రైతులందరూ తప్పక వినియోగించుకోవాలని ఆయన కోరారు.

➡️