వైకుంఠపురంలో అనిల్ కుమార్, నంబూరు

Feb 29,2024 11:09 #Guntur District
  • ఎమ్మెల్యే నంబూరు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు

ప్రజాశక్తి-అమరావతి : మండలంపరిధి వైకుంఠపురంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. వెంకటేశ్వరుడ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా తొలిసారి ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ అమరావతి మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు నంబూరు శంకరరావుతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ కి సాదర స్వాగతం పలికారు. వేదమంత్రోఛ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదాలు అందజేశారు. అనంతరం పునీత ఆంతోని చర్చి వద్ద ఫాదర్ ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వీరి వెంట మండల వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

➡️