ఆంధ్ర-కేరళ మ్యాచ్‌ డ్రా

Feb 19,2024 21:02 #Cricket, #Ranji Trophy, #Sports
  • క్వార్టర్స్‌లో మధ్యప్రదేశ్‌తో ఢీ
  • 23నుంచి రంజీట్రోఫీ నాకౌట్‌ పోటీలు

విశాఖపట్నం: ఆంధ్ర-కేరళ జట్ల మధ్య జరిగిన గ్రూప్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ డ్రా అయ్యింది. వికెట్‌ నష్టానికి 19 పరుగులతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర జట్టు చివరిరోజైన నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి 9వికెట్లు కోల్పోయి 189పరుగులు చేసింది. జనవరి 5న ప్రారంభమైన రంజీట్రోఫీ సీజన్‌ సోమవారం జరిగిన గ్రూప్‌ లీగ్‌ చివరి పోటీలతో ముగిసాయి. ఎలైట్‌ గ్రూప్‌-ఎ, బి, సి, డిలతో పాటు ప్లేట్‌ గ్రూప్‌లోనూ మ్యాచ్‌లు జరగ్గా.. ప్రతి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు ఇతర గ్రూపుల్లో ఆయా గ్రూపుల్లో రెండో స్థానంలో నిలిచిన జట్లతో క్వార్టర్‌ఫైనల్లో తలపడనున్నాయి. ఎలైట్‌ గ్రూప్‌-ఎలో విదర్భ(33పాయింట్లు), సౌరాష్ట్ర(28) తొలి రెండు స్థానాల్లో నిలువగా.. ఎలైట్‌ గ్రూప్‌-బిలో ముంబయి(37), ఆంధ్రప్రదేశ్‌(28), ఎలైట్‌ గ్రూప్‌-సిలో తమిళనాడు(28), కర్ణాటక(27), ఎలైట్‌ గ్రూప్‌-డిలో మధ్యప్రదేశ్‌(32), బరోడా(26) ఆయా గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వార్టర్స్‌కు చేరాయి. క్వార్టర్‌ఫైనల్‌ పోటీలు శుక్రవారం నుంచి జరగనున్నాయి. లీగ్‌ దశ ముగిసాయి. విదర్భ, ముంబయి, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ ఆయా గ్రూప్‌లలో టాప్‌లో నిలిచాయి. అలాగే ప్లేట్‌ గ్రూప్‌లో హైదరాబాద్‌-మేఘాలయ జట్ల మధ్య జరిగిన ఫైనల్లో హైదరాబాద్‌ జట్టు టైటిల్‌కు చేరువైంది.

23న జరిగే క్వార్టర్‌ఫైనల్స్‌…

విదర్భ × కర్ణాటక

ఆంధ్ర × మధ్యప్రదేశ్‌

ముంబయి × బరోడా

తమిళనాడు × సౌరాష్ట్ర

➡️