“డ్యూయెట్”లో ఆనంద్ దేవరకొండ లుక్

Mar 15,2024 11:02 #telugu movies

ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ “డ్యూయెట్”. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిథున్ వరదరాజ కృష్ణన్ “డ్యూయెట్”తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇవాళ ఆనంద్ దేవరకొండ  పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన నటిస్తున్న మదన్ క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేశారు. మనసంతా ప్రేయసిని నింపుకున్న ప్రేమికుడిగా ఆనంద్ దేవరకొండ ఈ లుక్ లో కనిపిస్తున్నారు. త్వరలోనే “డ్యూయెట్” సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఓ డిఫరెంట్ ప్రేమ కథగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా “డ్యూయెట్” సినిమాను రూపొందిస్తున్నారు.

నటీనటులు – ఆనంద్ దేవరకొండ, రితిక నాయక్, రావు రమేష్, తదితరులు

టెక్నికల్ టీమ్

స్టూడియో గ్రీన్ టీమ్ – నేహా జ్ఞానవేల్ రాజా, జి. ధనుంజయన్, ఎ.జి.రాజా, మురళీ కృష్ణ
సినిమాటోగ్రఫీ – అరుణ్ రాధాకృష్ణన్
ఎడిటింగ్ – జి.కె. ప్రసన్న
ప్రొడక్షన్ డిజైనర్ – ఉదయ్ కుమార్
సంగీతం – జి.వి. ప్రకాష్ కుమార్
పీఆర్ఓ- జీఎస్ కె మీడియా
బ్యానర్ – స్టూడియో గ్రీన్
సహ నిర్మాత – మధుర శ్రీధర్ రెడ్డి
నిర్మాత – కె.ఇ. జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం – మిథున్ వరదరాజ కృష్ణన్

➡️