గాజాలో మారణకాండకు నిరసనగా అమెరికన్‌ సైనికుడు ఆత్మహత్యా యత్నం

Feb 27,2024 10:57 #Gaza crisis

వాషింగ్టన్‌: గాజాలోచిన్నారులు, మహిళలు అన్న విచక్షణ లేకుండా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండపై తీవ్ర మనస్తాపానికి గురైన ఓ అమెరికన్‌ సైనికుడు ఆదివారం వాషింగ్టన్‌ లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం ఎదుట వంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. టెక్సాస్‌లో యాక్టివ్‌-డ్యూటీ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారిగా . లింక్డ్‌ఇన్‌ ఖాతాను బట్టి నిర్ధారించారు. ఈ ఆత్మహత్య సంఘటన ప్రత్యక్ష ప్రసారమైంది. ”నేను ఇకపై గాజాలో నరమేధంలో పాల్గొనను. గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండపై తీవ్ర నిరసనకు దిగబోతున్నాను,ఇప్పటికైనా పాలస్తీనాను విముక్తి చేయండి!” అంటూ బిగ్గరగా అరిచాడు, ఆ తరువాత తనకు తాను నిప్పంటించుకున్నాడు. సమీపంలో ఉన్న అధికారులు మూడు ఫైరింజన్లతో అతని శరీరంపై మంటలను ఆర్పి, ఆ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. .

➡️