యెమెన్‌పై అమెరికా, బ్రిటన్‌ మళ్లీ దాడులు

Feb 26,2024 11:30 #Yemen

 18 ప్రాంతాలపై బాంబుల మోత

సనా: ఇజ్రాయిల్‌ దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యెమెన్‌పై అమెరికా, బ్రిటన్‌ మరోసారి బాంబు దాడులతో విరుచుకుపడ్డాయి. ఎర్ర సముద్రంలో తమ నౌకలపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటు జరిపిన దాడులకు ప్రతీకారం పేరుతో ఈ రెండు దేశాలు శనివారం అర్ధ రాత్రి నుంచే దాడులకు తెగబడ్డాయి. పద్దెనిమిది హౌతీల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడుల పరంపర సాగించినట్లు అమెరికా, బ్రిటన్‌ చెప్పుకున్నాయి. ఈ దాడుల్లో సనా నగరంలో పలు పౌర అవాస ప్రాంతాలు ధ్వంసమైనట్లు వార్తలొసాఉ్తన్నాయి. మానవ ప్రాణాలను, స్వేచ్ఛా వాణిజ్యాన్ని రక్షించేందుకు తాము ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఎప్పటిలానే రోటీన్‌ డైలాగులు చెప్పారు. ఉక్రెయిన్‌ నుంచి గాజా వరకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న విధానాలకు, అవి చెప్పేమాటలకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు. దీంతో . మానవ హక్కులు, ప్రజాస్వామ్యం గురించి పశ్చిమ దేశాలు చెప్పే మాటలు విశ్వసనీయతను కోల్పోతున్నాయని అంతర్జాతీయ పరిశీలకులు పలువురు పేర్కొున్నారు.

➡️