Allu Arjun : అల్లు అర్జున్‌ మైనపు విగ్రహం.. ‘తగ్గేదేలే’ స్టిల్‌

Mar 29,2024 13:43 #allu arjun, #movie, #wax statue

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో నటనకుగాను అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా వరించింది. ఇక ఈ సినిమా సీక్వెల్‌గా దర్శకుడు సుకుమార్‌ ‘పుష్ప 2’ మూవీ కూడా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్‌ బర్త్‌డే (ఏప్రిల్‌ 8) సందర్భంగా గుర్తుండిపోయే గిఫ్ట్‌ అందుకున్నారు. గురువారం దుబారులోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తన కుటుంబంతో కలిసి అర్జున్‌ హాజరయ్యాడు. ఈ విగ్రహం అలా వైకుంఠపురం మూవీలో అల్లు అర్జున్‌ వేసుకున్న డ్రెస్‌ మాదిరిగానే రెడ్‌ జాకెట్‌తో పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే’ స్టిల్‌ మాదిరిగానే ఈ విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోని అల్లు అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘నేను నటించిన తొలి సినిమా గంగోత్రి సినిమా మార్చి 28 2003న విడుదలైంది. 21 సంవత్సరాల తర్వాత ఇదే తేదీన మార్చి 28 2024న దుబాయ్ మేడమ్‌ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం ఆవిష్కరణ. ఇది నాకెంతో ప్రత్యేకమైనరోజు. నా సినీ ప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులకు, వారి ప్రేమకు నా కృతజ్ఞతలు.’ అని అర్జున్‌ తన పోస్టులో రాసుకొచ్చారు. గంగోత్రి మూవీలోని ఓ స్టిల్‌ని, దుబాయ్ ఈవెంట్‌ ఫొటోని సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

 

➡️