అదానీపై లంచం ఆరోపణలు

Mar 17,2024 09:03 #Adani, #America, #Bribery Allegations

లంచం ఆరోపణలకు సంబంధించి అదానీ గ్రూప్, గౌతమ్ అదానీలపై అమెరికాలో విచారణ జరుగుతోందని అంతర్జాతీయ మీడియా బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. ఎనర్జీ ప్రాజెక్ట్‌కు సంబంధించి భారత్‌లోని అధికారులకు లంచాలు ఇవ్వడంలో అదానీ గ్రూప్ ప్రమేయం ఉందా లేదా అనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ మరియు యుఎస్ అటార్నీ ఆఫీస్ ఈ విచారణను నిర్వహిస్తున్నాయి.

పునరుత్పాదక ఇంధన రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీ అజూర్ పవర్ గ్లోబల్‌పై కూడా దర్యాప్తు సాగుతుంది. యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ గౌతమ్ అదానీ, భారతీయ కంపెనీపై ఇంకా అభియోగాలు మోపలేదు. విదేశీ లంచం లావాదేవీలు అమెరికన్ పెట్టుబడిదారులతో ప్రమేయం ఉన్నట్లయితే వాటిని దర్యాప్తు చేసే అధికారం కూడా న్యాయ శాఖకు ఉంది. అదానీ గ్రూప్‌లో చాలా మంది అమెరికన్ ఇన్వెస్టర్లు ఉన్నారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలున్న చైనా కంపెనీలతో అదానీ సంబంధాలపై కూడా వైట్ హౌస్ నిఘా పెట్టినట్లు సమాచారం. అదే సమయంలో, దర్యాప్తు నివేదిక అవాస్తవమని అదానీ గ్రూప్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ మోసానికి పాల్పడిందన్న హిండెన్‌బర్గ్ నివేదిక తీవ్ర సంచలనం సృష్టించింది.

➡️