రెండు డేటా సెంటర్ల మూసివేతలో ఎయిరిండియా

Dec 6,2023 09:00 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఎయిరిండియా తన రెండు డేటా సెంటర్లను మూసి వేయనుందని తెలుస్తోంది. తన వినియోగదారులకు సేవలందించేలా అప్లికేషన్లు, ఇతర సర్వీసులు కోసం ముంబయి, న్యూఢిల్లీలలో రెండు డేటా సెంటర్లను ఉపయోగిస్తుంది. కాగా.. తాజాగా వాటిని షట్‌డౌన్‌ చేస్తున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. వీటిని మూత వేయడం ద్వారా ఏడాదికి దాదాపు రూ.833 కోట్లు ఆదా చేయవచ్చని ఆ కంపెనీ భావిస్తుంది. మరోవైపు ఎయిరిండియా కార్యకలాపాలు కొనసాగించేందుకు అమెరికాలోని సిలీకాన్‌ వ్యాలీతో పాటు పాటు భారత్‌లోని గురుగ్రామ్‌, కొచ్చిలోని క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ను ఉపయోగించనుంది.

➡️