మరో అరుదైన ఘనత సాధించిన భారత వైమానిక దళం

న్యూఢిల్లీ :    భారత వైమానిక దళం ( ఐఎఎఫ్‌) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అననుకూల వాతావరణంలో కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌లో మొదటిసారి ఐఎఎఫ్‌ సి -130 జె విమానాన్ని రాత్రివేళ ల్యాండ్‌ చేసినట్లు ఆదివారం ప్రకటించింది. గరుడ్‌ కమాండోల శిక్షణలో భాగంగా ఈ విన్యాసం చేసినట్లు తెలిపింది. టెర్రైన్‌ మాస్కింగ్‌ను కూడా వినియోగించినట్లు వెల్లడించింది. ఈ విమానానికి నాలుగు టర్బోప్రాప్‌ ఇంజిన్లు ఉంటాయి.

భద్రతా బలగాలు, యుద్ధ సామాగ్రి తరలింపులో ఈ విమానాలు ముఖ్యపాత్ర పోషిస్తుంటాయి. ఎఎఫ్‌లో మొత్తం 12 సి-130జే విమానాలు ఉన్నాయి. ఇవి హిండన్‌లోని 77 స్క్వాడ్రన్‌, 87 స్క్వాడ్రన్‌లో విధులు నిర్వహిస్తున్నాయి.

➡️