వ్యవసాయం

Nov 29,2023 10:07 #Jeevana Stories

అనగనగా సీతారాంపూర్‌ అనే ఊరిలో సాంబయ్య, లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారి కొడుకు రాహుల్‌ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రాహుల్‌ తండ్రి సాంబయ్య అప్పుడప్పుడు దిగులుతో ఉంటున్నాడు. తండ్రి దిగులును గమనించిన రాహుల్‌ ‘ఏమైందని’ ఎంత అడిగినా సమాధానం చెప్పేవాడు కాదు. కొన్ని రోజులకు, తమ కొద్దిపాటి పొలంలో వ్యవసాయం సాగడం లేదన్న కారణంగానే తండ్రి బాధపడుతున్నాడని రాహుల్‌ గమనించాడు. కానీ, ఏం చేయాలో తెలియక బాధపడ్డాడు. ఒక రోజు రాహుల్‌ క్లాస్‌లో సైన్సు మాస్టారు వ్యవసాయం పాఠం చెప్పారు. పంటమార్పిడి వల్ల లాభాలు అర్థమయ్యేలా వివరించారు. ఇదే విషయాన్ని రాహుల్‌, తన తండ్రితో చెప్పాడు. ఈసారి పంట మార్పిడిలో భాగంగా కూరగాయల సాగు చేయమని సలహా ఇచ్చాడు.కొడుకు మాటలు విన్న సాంబయ్య మొదట ఆశ్చర్యపోయినా, ఆ తరువాత మాస్టారు చెప్పినట్లు కూరగాయల సాగు చేసి లాభం పొందాడు. పంటమార్పిడి చేస్తూ మరుసటి ఏడాది వరి పంట వేస్తే దిగుబడి బాగా వచ్చింది. సాంబయ్య కుటుంబం చాలా సంతోషించింది. చిన్నవాడైనా రాహుల్‌ సూక్ష్మ బుద్ధికి వాళ్లమ్మ ఎంతో మురిసిపోయింది. ఊర్లోని ప్రజలు కూడా సాంబయ్య వలే పంట మార్పిడి చేస్తూ అధిక లాభాలు పొందసాగారు.- చెప్యాల శరణ్య, 8వ తరగతి, జెడ్‌పిహెచ్‌ఎస్‌,హవేలీ ఘనపూర్‌, మెదక్‌ జిల్లా. 70362 77957

➡️