Agency Bandh: కొనసాగుతున్న బంద్‌(ఫోటోలు)

ప్రజాశక్తి-యంత్రాంగం : జిఒ నెంబర్‌ 3కి చట్టబద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌ జారీ చేయాలని, గిరిజన ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలను ఆదివాసీ అభ్యర్థులకే కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం, ఏజెన్సీ ప్రత్యేక డిఎస్‌సి సాధన కమిటీ ఆధ్వర్యాంలో గిరిజనులు ఆదివారం ఏజెన్సీ బంద్‌ చేపట్టారు. తెల్లవారుజామున నుండే బంద్ జరుగుతున్నది. ఏజెన్సీ సరిహద్దులు మూతపడ్డాయి. పెట్రోల్ బంక్ లు మూతపడ్డాయి. రోడ్లపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

చింతూరులో ప్రదర్శన
చింతూరులో ప్రదర్శన
చింతూరులో ప్రదర్శన

Bandh successful in Rajavommangi

గిరిజన సంఘం ఆధ్వర్యంలో మారేడుమిల్లి మండలంలో ఏజెన్సీ బంద్…

మన్యం బంద్ తో స్తంభించిన జనజీవనం…
జిల్లా కేంద్రం పాడేరులో మూతపడిన షాపులు …..
నిలిచిన ప్రైవేటు వాహనాల రాకపోకలు….
నిర్మానుష్య మైన ప్రధాన కూడలి ప్రాంతాలు…..

పాడేరు:- రాష్ట్ర మన్యం బంద్ కారణంగా అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో షాపులు, హోటళ్లు, దుకాణాలు, మూతపడ్డాయి. ప్రైవేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి ప్రాంతాలైన మెయిన్ రోడ్ అంబేద్కర్ సెంటర్ కాంప్లెక్స్ రోడ్ పాత బస్టాండ్ లోని షాపులు మూతపడడంతో నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదివాసీ గిరిజన సంఘం మరియు గిరిజన సమాఖ్య నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డు కొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ సమీపంలో బన్ నిర్వాహకులు రోడ్డుపై బైఠాయింపు జరిపారు. బంద్ కారణంగా జనజీవనం స్తంభించింది.

బంద్‌కు మద్దతుగా  సిపిఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ఐటిడిఎల వద్ద శనివారం ఆదివాసీ జన రక్షణ దీక్షలు చేపట్టారు. స్పెషల్‌ డిఎస్‌సి విడుదల చేయాలని, పోలవరం నిర్వాసితులందరికీ పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని, అటవీ భూముల చట్ట సవరణను రద్దు చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం అమలు చేయకుండా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గోదాట్లో ముంచేశారని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్‌సిని దగా డిఎస్‌సిగా విమర్శించారు. దీంట్లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. అడవులను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని అన్నారు. చింతూరు ఐటిడిఎ వద్ద జరిగిన దీక్షలను ఉద్దేశించి పార్టీ జిల్లా నాయకులు పల్లపు వెంకట్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద జనరక్షణ దీక్ష చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ గిరిజన సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఏజెన్సీ బంద్‌ను జయప్రదంగా కొనసాగుతున్నదని తెలిపారు.

కాశీపట్నం లో బంద్

కాశీపట్నం లో బంద్

 

 

 

డుంబ్రిగూడ మండలంలో బంద్ నిర్వహిస్తూ….

విఆర్ పురం మండలం రేఖపల్లి సెంటర్ లో రాష్ట్ర మన్యం బంద్ లో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రారంభించడం జరిగింది.

కూనవరం మండలములోని టేకులబోరు బంద్

 

మారేడుమిల్లిలో ఐదున్నర గంటలకు పెట్రోల్ బంకు బంద్

పెదబయలు మండలంలో ఆదివాసీ గిరిజన సంఘం, వివిధ సంఘాల మద్దతుతో బంద్ జరుగుచున్నది. బంద్ లో ”భారతదేశం బాకిన పడ్డదిరో నాయనా” పాటతో అలరించారు.

రంపచోడవరం లో బంద్

హుకుంపేట లో ఏజెన్సీ మన్యం బంద్

పెదబయలు మండల కేంద్రంలో ఉదయం ఐదు గంటల నుండి రాష్ట్ర మన్యం బంద్ సంపూర్ణంగా జరుగుతుంది.

డుంబ్రిగూడ మండలంలో మన్యం బంద్

 

➡️