కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆఫ్ఘన్ కేలండర్ ప్రకారం నూతన సంవత్సరాదికి ఒకరోజు ముందు అకడమిక్ ఇయర్ పున: ప్రారంభమైందని అధికారులు తెలిపారు ప్రభుత్వ యూనివర్శిటీలల్లో కూడా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైందని తెలిపారు. అయితే ఉన్నత స్థాయి తరగతుల్లో చేరకుండా బాలికలపై నిషేధం ఈ ఏడాది కూడా కొనసాగనుందని విద్యాశాఖ ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్న అనంతరం 2022 మార్చిలో తాలిబన్ ప్రభుత్వం బాలికల ఉన్నత విద్యపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.