భారత్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ రాయబార కార్యాలయం మూసివేత

Nov 24,2023 12:32 #Afghanistan, #embassy, #India, #Taliban

న్యూఢిల్లీ :   భారత ప్రభుత్వం నుండి నిరంతర సవాళ్ల నేపథ్యంలో ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని (ఎంబసీ)ని మూసివేస్తున్నట్లు గురువారం ఆఫ్ఘనిస్తాన్‌ ప్రకటించింది. వాస్తవానికి సెప్టెంబర్‌ 30 నుండి ఆఫ్ఘన్‌ ఎంబసీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మిషన్‌కు అనుకూలంగా భారత ప్రభుత్వవైఖరి మారుతుందనే ఆశాభావంతో తీసుకున్న చర్యగా పేర్కొంది. అయితే భారత్‌ నుండి ఆశించిన సహకారం అందకపోవడంతో శాశ్వత మూసివేతకు నిర్ణయం తీసుకున్నామని ఎంబసీ ప్రకటించింది. కొంతమంది దౌత్య అధికారులు తాలిబన్‌ ప్రభుత్వానికి విధేయత చూపుతుండటంతో అంతర్గత కలహాలు తలెత్తే అవకాశం ఉందని ఎంబసీ తమ ప్రకటనలో పేర్కొంది. తమ విధానాల్లో విస్తృత  మార్పుల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. భారత్‌లోని ఆఫ్ఘనిస్తాన్‌ పౌరులకు ఎంబసీ కృతజ్ఞతలు తెలిపింది.

➡️