రవికుమార్‌కు న్యాయవాదుల మద్దతు

నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్‌కు

న్యాయవాదుల సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్‌

ప్రజాశక్తి- ఆమదాలవలస

నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్‌కు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు మద్దతు పలికారు. గురువారం జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మి భారు ఆధ్వర్యంలో న్యాయవాదులు ప్రత్యేక సమావేశాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి రవికుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటు న్నామని ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవాదుల జీవనోపాధి కూడా కష్టతరంగా మారిందని, అలాగే స్థానిక కోర్టు ఆవరణలో బార్‌ అసోసియేషన్‌ భవనం, కక్షిదారుల విశ్రాంతి భవనం, మరికొన్ని మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజాప్రతినిధులు సహకరించాలని న్యాయ వాదులు కోరారు. పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో బిజెపి, జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కార్యక్రమంలో న్యాయవాదులు హనుమంతు ప్రసాదరావు, సాధు ధనుంజయరావు, పైడి వరాహ నరసింహం, టి. అన్నంనాయుడు, గణపతిరావు, మార్కండేశ్వరరావు, వెంకట రాజ్యలక్ష్మి, జి. వెంకటరావు, బి.మోహనరావు, బి.రమణ, వి.రాజేశ్వరరావు, జి.ప్రభాకర రావు, ఎస్‌.ప్రసాద్‌, త్రినాథరావు పాల్గొన్నారు.

 

➡️