కాకినాడలో నటి అమృత సందడి

Mar 30,2024 17:00 #Actress, #Business

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగరంలో సినీ నటి అమృత అయ్యర్ సందడి చేశారు. శనివారం కాకినాడలోని దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ జ్యువెలరీ మాల్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఆ బంగారు నగల దుకాణాన్ని సుమారు గంట పాటు పరిశీలించి నగలు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. సినీ నటి అమృత రాక సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ సమస్య లేకుండా నిలువరించారు. అమృతకు సీఎంఆర్ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది. అమృత అయ్యర్ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన హనుమాన్ చిత్రంలో కథానాయకగా నటించింది.

➡️