సిపిఎస్ రద్దును మేనిఫెస్టోలో చేర్చాలి

Mar 18,2024 01:12

యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు
ఓట్ ఫర్ సిపిఎస్ కరపత్రంను ఆవిష్కరణ
ప్రజాశక్తి – చీరాల
టిటిడి కళ్యాణ మండపం ఎదురు కొత్తపేట రోడ్డులోని యుటిఎఫ్ కార్యాలయం వద్ద ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయఇన అన్నారు. అయితే రాజకీయ పార్టీలు ప్రజలకు ఇస్తున్న వాగ్దానాలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయుల కూడా సిపిఎస్ రద్దు విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని అన్నారు. రాజకీయ సిపిఎస్ రద్దను ఆయా పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. ఎన్నికల అనంతరం ఉపాధ్యాయుల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానం అమలు కోసం రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారిన సిపిఎస్ రద్దు అనేది ఓ కలగానే మిగిలిపోతుందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలోనైనా రాజకీయ పార్టీలు ఉపాధ్యాయులకు అండగా నిలవాలని కోరారు. అనంతరం ఓట్ ఫర్ సిపిఎస్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మాజు శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, బండి బిక్షాలబాబు, కె వీరాంజనేయులు, షేక్‌ జానిబాషా, పి సురేష్, కె రామారావు పాల్గొన్నారు.

➡️