ఆర్‌సి-16 చిత్రానికి ఎఆర్‌ రెహమాన్‌

Jan 6,2024 19:05 #ar rehman, #movie

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ తన కెరీర్‌లో 16వ చిత్రం తీయనున్నారు. ఈ మూవీతో నూతన నిర్మాత వెంకట సతీష్‌ కిలారు వ్రిద్ది సినిమాస్‌ సంస్థ ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌, మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి గ్రాండ్‌గా నిర్మించనున్న ఈ చిత్రంలోకి సంగీత దర్శకుడికి ఆహ్వానం పలుకుతూ తాజాగా ఓ పోస్టర్‌ విడుదల చేశారు. పోస్టర్‌ ద్వారా ఏ ఆర్‌ రెహమాన్‌ ఇందులో భాగమవుతున్నారని తెలుస్తోంది. శనివారం రెహమాన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూ చిత్రబృందం ఈ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది.

➡️