ఆర్టీసీలో వచ్చే ఏడాదీ నష్టాలేనట

Feb 1,2024 08:57 #APSRTC
  • అంచనా నష్టం 1,618 కోట్లు 
  • ఆదాయం అంచనా 8,105 కోట్లు 
  • వ్యయర అంచనా 9,723 కోట్లు 
  • లెక్కలపై పెదవి విరుస్తున్న ఉద్యోగులు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఆర్టీసీలో ఇంకా నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయట. వచ్చే ఏడాది కూడా ఈ కష్టాలు తప్పవంటున్నారు అధికారులు. ఆదాయం కన్నా వ్యయం పెరిగిపోతోందని, అందుకే నష్టాలు వస్తున్నాయన్నది వారి వాదన. తాజాగా ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం సమర్పించిన నివేదికలో ఆదాయ వ్యయాలను విశ్లేషిస్తూ వివరణ పత్రాలను నివేదించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,618 కోట్ల వరకు నష్టాలు నెలకొంటాయని వారు అరదులో పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు చేసిన తరువాత కొంతవరకు నష్టాలు, కష్టాలు తగ్గుతాయని, అటు ప్రభుత్వం, ఇటు రోడ్డు రవాణా సంస్థ కూడా భావించాయి. అందుకు విరుద్ధంగా నష్టాలు ప్రతియేటా వెంటాడుతుండడంతో అధికారుల్లో ఆరదోళన పెరుగుతోంది. తాజాగా నివేదించిన గణాంకాల మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో 1,506 కోట్లు నష్టాలు రాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టాలు మరింత పెరిగి 1,618 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నట్లు ఆర్టీసీ విశ్లేషిరచిరది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7,356 కోట్ల రూపాయల ఆదాయం సమకూరగా, 8,863 కోట్ల వరకు వ్యయం జరిగినట్లు తేలింది. అరదుకే 1,506 కోట్ల నష్టం రికార్డయిందని చెబుతున్నారు.

ఇక కొత్త సంవత్సరంలో 8,105 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, 9,723 కోట్ల రూపాయల వ్యయం జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ప్రయాణీకుల నురచి వసూలు చేసే ఛార్జీల ద్వారా ఈ ఏడాది 6,036 కోట్లు రాగా, వచ్చే ఏడాది 6,666 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. అంటే దాదాపు 600 కోట్లకుపైగా అదనపు ఆదాయం లభిస్తుందని వివరించింది. ఇక వ్యయం విషయంలో ఉద్యోగుల నిర్వహణ వ్యయం ఈ ఏడాది కన్నా కొత్త సంవత్సరంలో 300 కోట్లకుపైగా పెరుగుతుందని చెబుతున్నారు. ఇంథన వ్యయం, లూబ్రికెరట్లు, వాహన పన్నులుకూడా పెరుగుతాయని వివరించింది. వీటికి అదనంగా ఇతర ఖర్చుల పేరిట మరో 200 కోట్లకుపైగా వ్యయం అవుతుందని వివరించడం విశేషం.

➡️